తెరాసలో కుమ్ములాటలకు కారణం ఏంటో చెప్పిన బాబూమోహన్

టిఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా నటుడు, టీఆరెస్ మాజీ నేత బాబు మోహన్ పార్టీని వీడి, బిజెపి రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ తో కలిసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేయారు. విజయవాడ కనకదుర్గ దర్శనానికి వచ్చిన అయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పిలిచి తప్పుచేశారన్నారు. దానివల్లనే ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని, పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం వలన స్వంత పార్టీలోనే కుమ్ములాటలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా పోటీచేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.