కాంగ్రెస్ పార్టీపై భాజపా నేత విమర్శనాస్త్రాలు

bjp-kishan-reddy | dandoraa.com

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం వాడీ వేడిగా కొనసాగుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో మిగతా పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రంలో మాదిరి సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా, ప్రత్యర్థి ఎత్తుగడలను చిత్తూ చేస్తూ ఎప్పటికప్పుడు మాటల దాడికి దిగుతోంది తెరాస. ఈ జగడం కేవలం ఈ రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బిజెపి రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనా అంతా అవినీతిమయం, అక్రమం, అరాచకం, దోపిడీ అంటూ విమర్శలు వ్యక్తం చేశారు. అంతేగాక రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఎవరికీ వారు తెలంగాణలో అధికారం తమదేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.