ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు..

boy-selfie | dandoraa.com

సెల్ఫీ మోజులో యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటే కొన్నిసార్లు తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. స్నేహితునితో కలిసి ఓ విద్యార్ధి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారీ లోయలపడ్డాడు. పశ్చిమ ఓడిశాలోని బారాగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. డియోధారా హిల్స్ లోని నలిచూహన్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన రాహుల్ అనే విద్యార్థి అదుపు తప్పి లోయలో పడ్డాడు. అప్పటి వరకు స్నేహితులతో సరదాగా సెల్ఫీ దిగి ఫోన్ పక్కన పెట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో షూ జారడంతో లోయలో పడిపోయాడు. అయితే తృటిలో ప్రాణాలతో బయటపడినప్పటికీ వెన్నెముకకు సర్జరీ చేశారు వైద్యులు. అతను పడిపోతున్న దృశ్యాన్ని స్నేహితుడు ఫోన్ ద్వారా చిత్రీకరించడంతో విషయం బయటకు తెలిసింది.