టిడిపిలో మరోసారి వెలుగు చూసిన వర్గపోరు.

tdp | dandoraa.com

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా నాయకుల మధ్య ఏర్పడిన విబేధాలు తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆ పార్టీలో ఏర్పడిన వర్గపోరు ఒక్కసారి భగ్గుమన్నది. స్థానికంగా ఉండే నేతల మధ్య ఏర్పడిన విబేధాల కారణంగా ఒకరి వెంట మరొకరు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. మంత్రి నక్కా ఆనందబాబు తమ పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపికి చెందిన భట్టిప్రోలు జడ్పిటిసి సభ్యురాలు బండారి కుమారి రాజీనామా చేశారు. మరోవైపు ప్రొద్దుటూరులో వరదరాజులు రెడ్డి మునిసిపాలిటీ పై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, చైర్మన్ ని అడ్డుపెట్టుకొని తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ 21 మంది కౌన్సిలర్లు, ఇద్దరో కో ఆప్షన్ సభ్యులు రాజీనామా చేశారు. వీరందరూ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన వారు కావడం విశేషం.