చరణ్, బోయపాటి సినిమాకి క్లాసిక్ టైటిల్.. ఎంత బాగుందో

charan-boyapati | dandoraa.com

రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రముఖ దర్శకుడు బోయపాటి కాంబో లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బోయపాటి చిత్రం అనగానే పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ ఉంటుంది. ఇక చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని ఇప్పటి వరకు తర్జన భర్జనలు పడ్డారు. మొదట మెగా స్టార్ నటించిన ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని భావించారు. అనంతరం బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమా పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇవి రెండు కాకుండా ఒక మంచి క్యాచీవ్ టైటిల్ ని ఒకే చేశారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా.. ‘ వినయ విధేయ రామ’. నిర్మాత డివివి దానయ్య సైతం ఇదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో దాదాపు చరణ్ మూవీ కి ఈ పేరు ఫైనల్ అయినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ విషయంపై బోయాపాటి ఎలాంటి క్లారిటీ ఇస్తారో..