దేవదాస్ రివ్యూ అండ్ రేటింగ్

devadas-review | dandoraa.com

మల్టీ స్టారర్ల హవా సాగుతున్న తరుణంలో నాని తో కలిసి అక్కినేని నాగార్జున కలిసి నటించిన తాజా చిత్రం ‘దేవదాస్’. తన తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన అలనాటి దేవదాస్ సినిమా టైటిల్ నే దీనికి ఉపయోగించుకున్న వారు ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారో చూద్దాం.

కథ : అంతర్జాతీయ మాఫియా డాన్ అయినా దేవా (నాగార్జున) తన తండ్రి (శరత్ కుమార్) ని చంపిన వారిని వెతుకుతూ హైదరాబాద్ వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో జరిపిన కాల్పుల్లో గాయపడుతాడు. ఇదే సమయంలో దాస్ ( నాని) అనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తరువాత దేవాను చూసి దాసు మారుతాడా లేక దాసును చూసి దేవా మారాడా అనేదే సినిమా కథ .

nani | dandoraa.com

విశ్లేషణ : సహజంగా కనిపిస్తూ తన మాటలతో నవ్విస్తూ కవ్విస్తూ ఉండే వ్యక్తి నాని. ఇక నాటి నుండి నేటి వరకు తన అందం, వాక్ చాటుగార్యంతో పాటు స్టైల్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన హీరో నాగ్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. వారి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా ఇద్దరూ తమదైన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సినిమాలో దేవా పాత్ర ఎంట్రీ కోసం అభిమానుల్లో ఆత్రుత నెలకొంటుంది. ఇక నాని రాగానే కామెడీ స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకించి నాని, నాగ్ ల మధ్య సాగే హాస్యం, కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.

nag | dandoraa.com

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే సినిమాలో రష్మిక కు సరియైన ప్రాధాన్యత లభించలేదని చెప్పవచ్చు. ఆకాంక్ష పరిస్థితి అంతే. ఆమెది చిన్న పాత్రే. అయినప్పటికీ ఇద్దరూ చక్కగా నటించారు. మిగతా క్యారెక్టర్ ల పరిస్థితి అంతే. ఎవరికీ పూర్తిస్థాయి నిడివి గల పాత్ర లభించలేదని చెప్పవచ్చు. సినిమా మొత్తం నాగ్, నాని లపైనే ఆధారపడి ఉంటుంది. ఇక కథ విషయంలో ఎలాంటి శ్రీరామ్ ఆదిత్య ఎలాంటి సాహసాలు చేయకుండా అలా అలా నడిపించేశాడు. వైజయంతి మూవీ బ్యానర్స్ కి తగినట్లు భారీ స్థాయిలో సినిమా ఉన్నది.

రేటింగ్ : 3/5.