బిగ్ బాస్ లో నేడు ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?

elimination | dandoraa.com

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ ఫైనల్స్ ఉండడంతో నేడు ఒకరిని ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నేటి కార్యక్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో కౌశల్ మొదటి స్థానంలో ఉండగా దీప్తి నల్లమోతు రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే అనూహ్య రీతిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా దీప్తి షో నుండి బయటకు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ స్థానంలో ఉన్న ఆమె ఏ విధంగా ఎలిమినేట్ అవుతుంది.. అసలు కారణం ఏమిటి అనే చర్చలు సోషల్ మీడియాలో జోరండుకున్నాయి. మరి వీటిలో నిజా నిజాలు ఏమిటో మరి కొద్ది సేపట్లో తెలిసిపోతుంది.