అభిమానులను షాక్ కి గురిచేస్తున్న ఇలియానా

Ileana1 | dandoraa.com

గోవా బ్యూటీ గా పేరుగాంచిన ఇలియానా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో ఆమె లుక్స్ తో పాటు నటన పట్ల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుమారు ఆరేళ్ళ క్రితం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన ఆమె అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలకు పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కోసం మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కి సంబంధించిన లుక్స్ ఎలా ఉంటాయా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తన్నారు. కాగా ఇటీవల ఆమె కారు దిగి ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఫోటోగ్రాఫర్స్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. అయితే ఆ ఫోటోలను చూసిన అందరూ షాక్ కి గురవుతున్నారు. సన్నని నడుముతో నాజూకుగా కనిపించే తాను బొద్దుగా ఉన్నది. దీంతో శ్రీను వైట్ల, రవితేజ కాంబో మూవీలో సైతం ఇలానే కనిపిస్తుందా లేక శ్రీనువైట్ల ఏమైనా మాయ చేస్తాడా అనే సందేహాలతో సినిమా విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

Ileana | dandoraa.com