పవన్ సభకి వెళ్తే 50 వేల జరిమానా…

pawan-meeting | dandoraa.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటా యాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు అనిపిస్తోంది. గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొల్లేరులో నిర్వహించే సభలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కొల్లేరు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు పవన్ సభకు ప్రజలు ఎవరూ కూడా వెళ్లరాదని, అలా వెళ్తే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేసినట్లు సమాచారం. అంతేగాక సభకు సంబంధించిన ఫ్లెక్సీ లను సైతం తొలగించడంతో ఇక సభ జరగదని అందరూ భావించారు. కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పవన్ సభ కొనసాగడంతో చివరికి అవన్నీ నిజం కావని అందరూ అనుకున్నారు. సభకి సైతం ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గ్రామా పెద్దల చే ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే చింతమనేని చేయించినట్లు భావిస్తున్నారు.