ఆపదలో హరీష్ రావు… పారిపోయిన టిఆర్ఎస్ నేతలు

harishrao | dandoraa.com

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి లో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డిలో టిఆర్ఎస్ నేతలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది యువ కార్యకర్తలు బాణా సంచా పేల్చారు. అయితే అతిదగ్గర్లో వాటిని కాల్చడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ వాహనాలను అక్కడే వదిలి భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో హరీష్ రావు అక్కడే ఉన్నారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రక్షణగా నిలిచి మంత్రిని అక్కడి నుండి తీసుకెళ్లారు.