ఆ హీరో చేసిన పని చూస్తే కళ్ళు తిరుగుతాయ్..

ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు తమ పుట్టిన రోజు వేడుకలను వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. తాజాగా ఓ హీరో విభిన్నమైన స్టైల్ లో పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు. ఆయన చేసిన పని చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఇంతకీ ఆయనెవరో తెలుసా. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్. తన 50 వ పుట్టిన రోజు సందర్బంగా గ్రాండ్ కెన్యా లోయ ప్రాంతంలో హెలికాప్టర్ పై నుండి బంగీ జంప్ చేశారు. అనంతరం తన అనుభూతిని ఫ్యామిలీతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.