ప్రకృతి ప్రకోపానికి కకావికలైన ఇండోనేషియా..

ప్రకృతి సృష్టించిన విలయతాండవానికి రాకాసి అలలు సైతం తోడవడంతో ప్రజలు విలవిల్లాడారు. ఊహించని విధంగా సంభవించిన ఘటన వల్ల 384 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియా ప్రాంతంలో సునామీ భీభత్సానికి వందలాది మంది గల్లంతయ్యారు. సునామీ ఏర్పడిన పలు నగరంలో 3 . 54 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు కొనసాగుతుండగా సుమారు 6 మీటర్ల ఎత్తుకు లేచిన అలలు ఒక్కసారిగా విరుచుకుపడి బీభత్సం సృష్టించాయి. తొలుత మృతుల సంఖ్యా తక్కువగా ఉందని భావించినప్పటికీ అమాంతం వారి సంఖ్యా పెరిగిపోయిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.