స్వర్ణకారులకు జగన్ అభయహస్తం….

ys-jagan | dandoraa.com

కార్పొరేట్ జ్యువలరీ సంస్థలతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్న విశ్వబ్రాహ్మణులకు (స్వర్ణకారులు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభయహస్తం అందించారు. సుదీర్ఘకాలం నుండి సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జననేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్బంగా కోరుకొండ వద్దకు చేరుకోగానే స్వర్ణకారులు ఆయన్ని కలిసి తమ బాధను వెళ్లబోసుకున్నారు. వారి బాధలను అర్థంచేసుకున్న జగన్ మోహన్ రెడ్డి అభయహస్తాన్ని అందించారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రాగానే స్వర్ణకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాళిబొట్టు తయారు చేసే హక్కును వారికి మాత్రమే కల్పిస్తానని తెలిపారు. అంతేగాక స్వర్ణ కారులను వేధింపులకు గురిచేస్తున్న జీవో నెంబర్ 272 లోని చట్టాన్ని మారుస్తానని హామీ ఇచ్చారు. దీంతో సంతసించిన స్వర్ణకారులు జగన్ గెలుపుకై కృషిచేస్తామని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగిపోతాయని అభిప్రాయం వ్వ్యక్తం చేశారు.