ధోనికి కోపం తెప్పించిన కుల్దీప్… ఫైర్ అవుతున్న నెటిజన్లు

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ స్థాయిలో ఎన్నో విజయాల్ని సాధించి పెట్టిన మహేంద్ర సింగ్ ధోనిని అభిమానించని వారు ఎవరూ ఉండరు. సీనియర్లు సైతం ఆతని కెప్టెన్సీ చూసి మంత్రముగ్దులవుతారు. అలాంటి ఘనత సొంతం చేసుకున్న ధోనీ గత కొంత కలం కిందట కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పారు. దీని వల్ల అభిమానులు కొంత నిరాశ చెందారు. అయినప్పటికీ ధోనీ జట్టులో కొనసాగుతూ ఎప్పటికప్పుడు జట్టు సభ్యులకు తన సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నాడు. ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ధోని సలహాలు పాటిస్తాడు. ఎవరూ కూడా అతని మాట జవదాటరు. అంతలా ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు. అందరూ ధోనీ నుండి చాలా నేర్చుకుంటారు. ముఖ్యంగా ఎలాంటి సమయంలోనైనా కూల్ గా ఉండడం అతను ప్రత్యేకత. ఎప్పుడూ కూల్ గా కనిపించే ధోనీకి ఓ బౌలర్ విపరీతమైన కోపాన్ని తెప్పించాడు. అయినప్పటికీ ధోనీ అతనిపై విరుచుకు పడలేదు. సున్నితంగానే తన కోపాన్ని చూపించాడు. ఇంతకీ ధోనీకి కోపం తెప్పించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ బౌలర్ కుల్దీప్ ఫీల్డర్ ని వేరే చోటుకు మార్చాలని అదే పనిగా కోరడంతో బౌలింగ్ చేస్తావా లేక వేరే వాళ్ళకి అప్పగించాలి అంటూ కుల్దీప్ పై కోపగించుకున్నాడు. దీంతో సైలెంట్ గా కుల్దీప్ బౌలింగ్ చేశాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీకి కోపం తెప్పించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్లు అతనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.