మళ్ళీ నోరు జారిన లోకేష్… సెటైర్లు వేస్తున్న నెటిజనులు

lokesh | dandoraa.com

చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ అప్పుడప్పుడు నోరుజారుతూ ఉంటారని పలువురు పేర్కొంటారు. ఆయనకు మాట్లాడడం కూడా సరిగా రాదనీ, ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెబుతారంటూ అనేవారూ లేకపోలేదు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఇంతకీ అయన చేసిన పోస్ట్ ఏంటి ? చూద్దాం..

‘నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైంది ఈ కమనీయ దృశ్యం’ అంటూ టిడిపి వ్యవస్థాపకుడు, దివంత నేత నందమూరి తారక రామారావు ఫోటో పోస్ట్ చేశారు. ఇక దాన్ని చూసిన కొందరు. ‘ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచారు అని అన్నగారు చెబుతున్నట్లు ఉంది ‘ అని కామెంట్ చేయగా, ‘చూడండి బ్రదర్ చంద్రస్తమయం అని చూపిస్తున్నట్లుగా ఉంది’ అంటూ పోస్ట్ చేశారు. ఇంకొందరైతే ‘చంద్రన్న సమయం 90 శాతం అయిపొయింది ఇక మిగిలింది 10 శాతమే అని చూపిస్తున్నట్లు ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పాపం లోకేష్ పోస్ట్ చేయకున్నా ఉంటె బాగుండేది అని అనుకుంటున్నట్లు ఉంది పరిస్థితి.