అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా..

balka-suman | dandoraa.com

టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల టి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక రేవంత్ రెడ్డి ముమ్మాటికీ చంద్రబాబు బినామీ అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు డబ్బుతోనే అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పురుగు, దొంగ, అరాచక వాడి అంటూ విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబే కేసీఆర్ ని ఏం చేయలేకపోయాడు ఇక నీవెంత? కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ చూపిస్తావా లేక అక్కడే బొందపెట్టాలా ? ‘ అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేల ఇంట్లో కూడా ఐటి సోదాలు జరిగాయని, లెక్కల్లో తప్పు ఉంటేనే ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తారు గానీ టిఆర్ఎస్ కి ఏం సంబంధం ఉంటుంది అన్నారు. తెలంగాణాలో ఒక విషపు మొక్కలా ఉన్నావ్ అని విమర్శలు వ్యక్తం చేశారు.