ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకున్న నాని

nani | dandoraa.com

నాని, నాగార్జున మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవదాస్’ రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హీరో నాని సినిమా గురించి మాట్లాడుతూ తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో రానా, నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు షోకి నాగార్జున, అమల జంటగా విచ్చేశారు. ఆ సమయంలో రెడ్ కార్పెట్ వద్ద బయట ‘నాని, రానా హోస్ట్ చేస్తున్నారు కదా.. మీరు ఈ షో ని బాగా ఎంజాయ్ చేస్తారా’ అని అడిగినప్పుడు ‘ నాని అంటే నాకు చాలా ఇష్టం’ అని నాగార్జున చెప్పారని, వెంటనే అమల ముందుకు వచ్చి ‘ తెలుగు ఎంత బాగా మాట్లాడుతాడండీ.. సో స్వీట్ ‘ అంటూ పొగిడినట్లు తెలిపారు. ఆ ప్రశంస తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నాని తెలిపారు.