బిగ్ బాస్ షో గురించి అసలు విషయం బయటపెట్టిన నాని

biggboss2 | dandoraa.com

నాని, నాగార్జున కాంబోలో మల్టీ స్టారర్ గా రూపొందిన చిత్రం ‘దేవదాస్’ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒకవైపు తన సినిమా కి క్రేజ్ వచ్చినప్పటికీ నాని మాత్రం ఇంకా టెన్షన్ గానే ఉన్నారు. ఎందుకో తెలుసా..? నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మరో మూడు రోజుల్లో ఫైనల్ రౌండ్ కి చేరుకోనుంది. దీంతో తన సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాడు. అదీకాక బిగ్ బాస్ షో పూర్తయ్యాక తానూ కాశీ లేదా వేరే ఏ ప్రాంతానికన్నా వెళ్తా అని నాని పేర్కొనడం బట్టి చూస్తుంటే ఈ షో పట్ల నాని కి ఉన్న నెగెటివ్ ఫీలింగ్ అర్థమవుతోంది. అదీకాక ఈ షో నిర్వాహకులు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు నాని పేర్కొన్నారు. వారానికి రెండు రోజులే కదా అనుకుంటే వారం మొత్తం అందరితో కలిసి చాలా కష్టపడాల్సి వచ్చిందని , ఒక పని ఒప్పుకున్నా తరువాత దాన్ని వందశాతం పూర్తి చేయాలి కాబట్టి షో కోసం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాడు. నాని మాటలను బట్టి చూస్తుంటే బిగ్ బాస్ షో థర్డ్ సీజన్ కి హోస్ట్ గా ఛాన్స్ ఇచ్చినా ‘వద్దు బాబోయ్’ అంటూ చేతులెత్తేసాలా ఉన్నాడు అనిపిస్తోంది.