‘నోటా’ రివ్యూ అండ్ రేటింగ్

nota | dandoraa.com

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువకెరటం విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తో దశ తిరిగింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అతను సినీ పరిశ్రమకు వచ్చిన తక్కువ కాలంలోనే రాజకీయా నేపథ్యం ఉన్న కథ ఎంచుకోవడం సాహసమే. మరి అలాంటి కథతో తన ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.

nota-review | dandoraa.com

స్టోరీ : ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కుమారుడు అయినా వరుణ్ (విజయ్) తండ్రికి దూరంగా లండన్ లో ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉంటాడు. అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కున్న వాసుదేవ్ ఓ స్వామిజి చెప్పిన మాట విని తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాడు. రెండు వారాల తరువాత మళ్ళీ పదవి చేపట్టవచ్చని భావిస్తాడు. అయితే ఊహించని విధంగా అతడికి కోర్టు దోషిగా తేల్చి ఐదేళ్ల శిక్ష వేస్తుంది. దీంతో వరుణ్ శాశ్వత సీఎం గా ప్రజలకు ఎంతో దగ్గరవుతాడు. అనుకోని విధంగా బెయిల్ సంపాదించిన వాసుదేవ్ జైలు నుండి తిరిగి వచ్చే క్రమంలో అతనిపై బాంబు దాడి జరుగుతుంది. అదే సమయంలో తన తండ్రి గురించి భయంకరమైన నిజం తెలుసుకుంటాడు వరుణ్. అసలు అతనికి తెలిసిన నిజం ఏమిటి? వాసుదేవ్ వ్యక్తిత్వం ఎలాంటిది ? పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా వరుణ ఏం సాధించాడు అనేది తెరపై చూడాల్సిందే.

vijay1 | dandoraa.com

విశ్లేషణ : ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి అనే కోణంలో విజయ్ దేవరకొండ తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. ఇక మెహరీన్ కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తుంది. చుట్టూ ఉన్న రాజకీయాల గురించి జనం ఎప్పుడూ మాట్లాడుకుంటారు కాబట్టి సినిమాలో కూడా సహజంగా చుట్టూ జరిగే పరిణామాలను తెరపై చూపించారు. ఇంతకు ముందు రానా, మహేష్ బాబులు ‘లీడర్’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో సీఎం గా అలరించినట్లే విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇందులో కాస్త కొత్తదనం కనిపిస్తోంది. గత సినిమాల్లో తండ్రిని మంచి వ్యక్తిగా చూపించగా ఇందులో కాస్త నెగెటివ్ రోల్ ఉంటుంది. ఇక సినిమాల్లో విలనిజాన్ని తగిన ప్రాధాన్యత ఇవ్వనట్లు కనిపిస్తోంది. స్వామిజి పాత్రను ఇంకాస్త వాడుకుని కొంచెం మసాలా జోడించి ఉంటె బాగుండేది. సీఎం గా వరుణ్ తీసుకునే నిర్ణయాల్లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోగా మరికొన్ని చప్పగా సాగుతాయి. సీఎం కి సహాయం చేసే జర్నలిస్ట్ గా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు కానీ అతని ప్రేమ వ్యవహారం సీన్ కాస్త బోర్ కొట్టిస్తుంది. మొత్తం మీద రౌడీ సీఎంగా విజయ్ దేవరకొండ కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

రేటింగ్ : 2.5