ఎన్టీఆర్ కుమార్తె గా నటించనున్న ప్రముఖ నృత్య కారిణి..

daggubati-purandeswari | dandoraa.com

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత విశేషం ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం లో ఇప్పటికే పలు కీలక పాత్రల పై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే పురందేశ్వరి పాత్రలో నటిస్తున్నదంటూ ఒక నటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా..?
చెన్నైకి చెందిన ప్రముఖ నృత్యకారిణి హిమాన్సీ ఈ పాత్రలో నటిస్తున్నదంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ పురందేశ్వరితో కలిసి హిమాన్సీ దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందొ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.