తెలంగాణాలో ఎన్నికలు జరిగేనా..? ముందస్తుపై విచారణ చేస్తున్న సుప్రీం కోర్టు

telangana | dandoraa.com

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పదవికి రాజీనామా చేసి, తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే కలిగే అనర్థాలపై కాంగ్రెస్ పార్టీ నేత శశిధర్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసి ఈ అంశంపై వివరణ ఇవ్వమని ఆదేశించింది. కాగా ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీంతో రాష్ట్రమంతటా ఉతంతటా నెలకొంది. నేడు సుప్రీం ఇచ్చే తీర్పుపైనే తెలంగాణ ముందస్తు ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉన్నది కావునా నాయకులంతా తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.