బట్టలిప్పి డాన్స్ చేయమన్నాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

vivek | dandoraa.com

బాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మాట్లాడిన హీరోయిన్ తనుశ్రీ దత్త మరో సంచలన ఆరోపణలకు తెరలేపింది. గతంలో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. అయితే అలాంటిదేమీ లేదని అంతమంది సభ్యుల ముందు తానూ ఆమెను ఎలా వేధిస్తానని పటేకర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడిపై తనుశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తోలి సినిమా దర్శకుడు వివేక్ అగ్ని హోత్రీ సినిమా షూటింగ్లో భాగంగా తనను బట్టలు విప్పి డాన్స్ చేయమన్నాడని పేర్కొన్నది. అదీ కూడా నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముందు అని చెప్పింది. దానికి ఇర్ఫాన్ అలాంటి డాన్సులే వద్దకు అని వారించాడని, సెట్ లో ఉన్న సునీల్ శెట్టి కూడా వద్దని చెప్పినట్లు తెలిపింది. తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.