జగన్ అభిమానులు తొడగొట్టే వార్త చెప్పిన తెలంగాణ మంత్రి

nayini | dandoraa.com

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ముమ్మాటికీ జగన్  మోహన్ రెడ్డినే. ఈ మాట చెప్పింది ఎవరో కాదు స్వయంగా పొరుగు రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి. ఈ సందర్బంగా నాయిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకి వెళ్లిందని అన్నారు. అసెంబ్లీలో తన ఇద్దరు చెంచాలు ఉండాలనే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మర్రి శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేగాక కేసీఆర్ పై విమర్శలు చేసే వారు లేకనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర ప్రజలను చంద్రబాబు పట్టిపీడిస్తున్నాడని రాబోయే ఎన్నికల్లో ప్రజలే స్వయంగా ఆయనకు బుద్ది చెబుతారన్నారు. ఏపీని సస్యశ్యామలంగా పాలించగలిగేది, ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే సత్తా ఉన్న వ్యక్తి కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని జోస్యం చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకి చేరువై వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్న ఆయన్నే వచ్చే ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని తేల్చి చెప్పారు.