మావోయిస్టుల టార్గెట్ లో టిఆర్ఎస్ నేతలు..

Maoists | dandoraa.com

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావును మావోయిస్టులు కాల్చి చంపినా ఉందంతం తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోల కదలికలపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు వారి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తూ ఉంది. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మావోయిస్టుల హిట్ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు ఉన్నట్లు అనిపిస్తోంది. మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల పై దృష్టి సారించిన మావోలు ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా దండకారణ్యంలో గత రెండు నెలల నుండి వ్యూహ రచన చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బృందం తెలిపింది. ఈ విషయం తెలిసిన తెలంగాణ డిజిపి పొలిసు అధికారులను అప్రమత్తం చేసి తెలంగాణాలో రెడ్ అలర్ట్ ప్రకటించారట. ఎప్పటికప్పుడు మావోయిస్టుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పొలిసు యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం టిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీలను మాత్రమే మావోయిస్టులు టార్గెట్ చేసి కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.