ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్

mla-rathod-bapurao | dandoraa.com

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముందస్తు ఎన్నికలలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అన్ని నియోజక వర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన ఓ ప్రజా ప్రతినిధికి ఊహించని షాక్ ఎదురైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కూచులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బోథ్ నియోజవర్గం ఎమ్మెల్యే బాపురావు కూచులాపూర్ గ్రామంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో గ్రామంలోని కొంతమంది యువకులు ఇప్పటి వరకు గ్రామానికి మీరేం చేశారో చూపెట్టాలని నిలదీశారు. దీంతో కంగుతిన్న సదరు ఎమ్మెల్యే నేను మీ ఊరిలో ఎవరినీ ఓట్లు అడగడానికి రాలేదని, సాయిబాబా ఆలయంలో పూజలు చేసేదుకు వచ్చినట్లు తెలిపారు. అంతేగాక ఇకపై మీ ఊరిలో ఏ ఒక్కరిని ఓటు అడిగానని పేర్కొంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.