కేటీఆర్ అలాంటి వారు కాదు – విజయ్ దేవరకొండ

vijay | dandoraa.com

తెలుగు సినీ పరిశ్రమలో అనతికాలంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టిన ఆటను ‘అర్జున్ రెడ్డి’ తో ఓవర్ నైట్లోనే ఎనలేని గుర్తింపు సంపాదించారు. ఇటీవల విడుదలైన ‘ గీత గోవిందం’ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా ఆయన నటించిన ‘నోటా’ సినిమా ఈరోజు విడుదలయింది. దీంతో సినిమా విశేషాల గురించి చర్చించిన అతను పలువురు రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ‘నోటా’ సినిమాలో తానూ కేటీఆర్ స్టైల్ ని ఫాలో అయ్యానని, అందరు నాయకుల్లా వైట్ అండ్ వైట్ కాకుండదా షర్ట్స్ వేస్తూ హుందాగా కనిపిస్తారని అంతేగాక, చాలా మంది రాజకీయ నేతలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే పలు కార్యక్రమాలు చేపడుతారని కానీ కేటీఆర్ మాత్రం అలా చేయరని అదే అయన వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు. ఇక తానూ నటించిన ‘నోటా’ సినిమాకి తమిళనాడులో యు సర్టిఫికెట్ వచ్చినప్పుడు కొంత నిరాశ చెందినట్లు అయితే ఇక్కడ యు/ఏ ఇవ్వగానే సంతోషపడ్డానని చెప్పారు. అసలు రాజకీయాల గురించి ఏమీ తెలియని ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఏమి సాధించాడు అనేదే సినిమా స్టోరీ అంటూ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తమ ‘నోటా’ సినిమా చూసి భయపడుతున్నారని, నిజం చెప్పాలంటే తప్పుచేసి వారు మాత్రమే జంకుతారని, మిగిలిన పార్టీల వారు సంతోషంగా సినిమాని ఎంజాయ్ చేస్తారన్నారు.