సుప్రీం ‘వివాహేతర సంబంధం ‘ తీర్పుకు బలైన ఇల్లాలు

chennai-woman | dandoraa.com

పెళ్లయిన భార్య భర్తలు తమ ఇష్టంతో వేరే వారితో శృంగారంలో పాల్గొనే అంశంపై ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ అనంతరం భార్యను తమ హక్కుగా భర్త భావించరాదని, వారి స్వేచ్చకు ఇది భంగం కలిగిస్తుందని భావించిన సుప్రీం కోర్టు ఆడ, మగ ఎవరైనా తమ ఇష్టానుసారం వేరే వారితో శృంగారంలో పాల్గొనవచ్చని తీర్పు ఇచ్చింది. ఒక విధంగా సుప్రీం కోర్టు తీర్పు సబబే అయినప్పటికీ కొంతమంది మగవారు దీన్ని ఆసరాగా చేసుకుని కట్టుకున్న భార్యను కాదని వేరే వారితో అక్రమ సంబంధాలు సాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

చెన్నై లోని ఎంజీఆర్ నగర్ కి చెందిన పుష్పలత అనే మహిళ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పార్క్ లో పనిచేసే జాన్ ఫ్రాంక్లిన్ ని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరికి ఒక సంతానం కూడా ఉంది. అయితే గత కొద్దీ రోజుల క్రితం పుష్పలత తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో భర్త ఆమెను పట్టించుకోవడం మానేసి వేరే మహిళతో సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి అతన్ని నిలదీయగా, మొన్న సుప్రీం కోర్టు అక్రమ సంబంధం తప్పు కాదని తీర్పు ఇచ్చింది. ఇక నన్నెవరూ ఏమి చేయలేరు.. అంటూ బదులిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది. వివాహేతర సంబంధాల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు అమాయకపు మహిళల పాలిట శాపంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు. మహిళలకు అన్యాయం జరగ కూడదని దేశ అత్యున్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును ఆసరాగా చేసుకుని కట్టుకుని కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్న భర్తల పై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అని చర్చించుకుంటున్నారు.